![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -64 లో....గంగని ఇంట్లో వాళ్ళు అట పట్టిస్తారు. నీకు ఎలాంటి అతను కావాలని అడుగుతారు. నా రాజకుమారుడు ఎక్కడ ఉన్నాడోనని చిన్ని మాటలని గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత గంగకి చిన్నీ ఫోన్ చేసి.. నా బడ్డీ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడికి వస్తే అతన్ని చూడొచ్చని చిన్ని చెప్తుంది. ఆ రాజకుమారుడినా.. తప్పకుండా చూడాలని గంగ అనుకుంటుంది.
రుద్ర తీసుకున్న డ్రెస్ గంగ వేసుకుంటుంది. మరొకవైపు రుద్ర బాగా రెడీ అవుతాడు. అప్పుడే రుద్రకి చిన్ని వీడియో కాల్ చేసి ఎలా రెడీ అయ్యాడో చూస్తుంది. త్వరగా రమ్మని చిన్ని చెప్పగానే సరేనని రుద్ర గదిలో నుండి బయటకు వస్తాడు. గంగ కూడా అప్పుడే బయటకు వస్తుంది. రుద్ర సైలెంట్ గా కిందకి వెళ్తాడు. తన వెనకాలే గంగ వెళ్తుంది. ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారని ఇందుమతి అడుగుతుంది. నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నానని గంగ అంటుంది. ఒంటరిగా వద్దని చెప్పాను కదా అని రుద్ర అంటాడు. మరి మీరు నన్ను నా ఫ్రెండ్ దగ్గర వదిలెయ్యండి అని గంగ రిక్వెస్ట్ చెయ్యగానే రుద్ర సరే అంటాడు.
ఆ తర్వాత గంగ స్కూల్ దగ్గర దిగుతుంది. రుద్ర కూడ నాకు ఇక్కడే వర్క్ ఉందని అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్తారు. రుద్రకి అప్పుడే ఇన్‌స్పెక్టర్ ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇచ్చిన అతను దొరికాడు వెంటనే రమ్మని చెప్తాడు. తరువాయి భాగంలో చిన్నిని గంగ కలిసి మాట్లాడుతుంది. గంగ వాళ్ళ అమ్మ ఫోటోని చిన్ని చూసి వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది. వెంటనే గంగ బయటకు వస్తుంటే.. రుద్ర ఎదురుపడుతాడు. గంగని పెళ్లి చేసుకోవాలనుకున్న అతను గంగని కిడ్నాప్ చెయ్యాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |